మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Oct 02, 2020 , 18:08:04

స్వ‌చ్ఛ భార‌త్ అవార్డు అందుకున్న సందీప్ కుమార్ సుల్తానియా

స్వ‌చ్ఛ భార‌త్ అవార్డు అందుకున్న సందీప్ కుమార్ సుల్తానియా

హైద‌రాబాద్ : స్వ‌చ్ఛ భారత్‌లో దేశంలోనే మొద‌టి స్థానంలో నిలిచిన తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర జ‌ల్ శ‌క్తి మంత్రి గ‌జేంద్ర సింగ్ షెకావ‌త్ శుక్ర‌వారం వ‌ర్చువ‌ల్ ప‌ద్ధ‌తిలో అవార్డును అంద‌చేశారు. గాంధీ జ‌యంతి, స్వ‌చ్ఛ భార‌త్ దివ‌స్ సంద‌ర్భంగా ఈ అవార్డుని తెలంగాణ రాష్ట్రం త‌ర‌పున రాష్ట్ర‌ పంచాయ‌తీరాజ్, ‌గ్రామీణాభివృద్ధి, పారిశుద్ధ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా అందుకున్నారు. ఈ కార్య‌క్ర‌మంలో క‌మిష‌న‌ర్ ఎం.ర‌ఘునంద‌న్ రావు, స్వచ్ఛ భారత్ మిషన్ డైరెక్ట‌ర్ ఎస్.దిలీప్ కుమార్, రాష్ట్ర స్వచ్ఛ భారత్ మిషన్ బృందం స‌భ్యులు పాల్గొన్నారు.


కేంద్ర మంచి నీరు - పారిశుద్ధ్య శాఖ గత సంవత్సరం మూడు ర‌కాల‌ ప్రచారాలను ప్రారంభించింది. నవంబర్ 1 నుండి 2020 ఏప్రిల్ 30 వరకు “స్వచ్ఛ సుందర్ సముదాయిక్ షౌచాలయ (ఎస్ఎస్ఎస్ఎస్)” కార్య‌క్ర‌మం, 15 జూన్ 2020 నుండి 15 సెప్టెంబర్ 2020 వరకు “సముదాయిక్ షౌచాలయ అభియాన్ (ఎస్ఎస్ఎ)” కార్య‌క్ర‌మం, 2020 ఆగస్టు 8 నుండి ఆగస్టు 15 వరకు కమ్యూనిటీ మరుగుదొడ్ల నిర్మాణానికి, జిల్లాలు, గ్రామాలను సమీకరిస్తూ, దేశంలో చెత్త, వ్యర్థాలను తొల‌గించేందుకు గంద‌గీ ముక్త్ భారత్ (డిడిడబ్ల్యుఎస్) కార్య‌క్ర‌మాన్ని నిర్వహించింది. ఇందులో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే వ‌ర‌స‌గా మూడో సారి మొద‌టి స్థానంలో నిలిచి హ్యాట్రిక్ సాధించింది. కాగా ఈ సారి క‌రీంన‌గ‌ర్ జిల్లా దేశంలోనే 3వ స్థానంలో నిలిచింది. logo