బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 20, 2020 , 11:39:00

ఇసుక అక్రమ రవాణా.. ఆరుగురు అరెస్ట్‌

ఇసుక అక్రమ రవాణా.. ఆరుగురు అరెస్ట్‌

హైదరాబాద్‌ : ఇసుక అక్రమ రవాణా చేస్తున్న ఆరుగురిని అరెస్టు చేసినట్లు రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ మహేష్‌ భగవత్‌ తెలిపారు. నకిలీ వే బిల్లులు సృష్టించి ఇసుకను అక్రమంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల్లో ఇద్దరు పొరుగు సేవల సిబ్బంది ఉన్నారు. నిందితుల వద్ద నుంచి రూ. 3.2 లక్షలు, ల్యాప్‌టాప్‌, 9 ఫోన్లు, ప్రింటర్‌ను స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ పొరుగు సేవల సిబ్బందితో కలిసి ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నవీన్‌, కిరణ్‌, రాజశేఖర్‌ ఇసుక రాకెట్‌ను నడిపిస్తున్నారు. గుత్తేదారు కిరణ్‌ కుమార్‌ మార్చి నుంచి ఇసుక క్వారీ నిర్వహిస్తున్నాడు. మల్యాల క్వారీ నుంచి ఇప్పటి వరకు 500 లారీల ఇసుక తరలించారు. ఈ ఏడాది జనవరి నుంచి జూన్‌ వరకు రూ. 15 లక్షలకు క్వారీ లీజుకు తీసుకున్నట్లు విచారణలో తేలింది. 


logo