గురువారం 04 జూన్ 2020
Telangana - Feb 01, 2020 , 01:20:25

చర్లపల్లి జైలుకు సమత నిందితులు

చర్లపల్లి జైలుకు సమత నిందితులు

చర్లపల్లి, ఆదిలాబాద్ అర్బన్, నమస్తే తెలంగాణ: సమత లైంగికదాడి కేసులో ఉరిశిక్షపడ్డ దోషులు షేక్‌బాబు, షేక్ షాబుద్దీన్, షేక్ మఖ్దూంను గురువారం అర్ధరాత్రి  హైదరాబాద్ చర్లపల్లి కేంద్ర కారాగారానికి తరలించారు. ఈ కేసును విచారించిన ఫాస్ట్‌ట్రాక్ కోర్టు గురువారం తుదితీర్పు ప్రకటించిన అనంతరం వీరిని తొలుత ఆదిలాబాద్ జిల్లా జైలుకు తరలించారు. నిబంధనల ప్రకారం రెండేండ్లలోపు శిక్షపడ్డ ఖైదీలను మాత్రమే జిల్లా జైలులో ఉంచే అవకాశం ఉన్నది. అంతకంటే ఎక్కువ శిక్షపడ్డవారిని సెంట్రల్‌జైలుకు తరలించాల్సి ఉంటుంది. దీంతో వీరిని ప్రత్యేక వాహనంలో, కట్టుదిట్టమైన భద్రత నడుమ చర్లపల్లి సెంట్రల్‌జైలుకు తరలించారు. చర్లపల్లి జైలు పరిసరాల్లోనూ, కారాగారంలోని బ్యారక్‌ల వద్ద కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటుచేశారు.


logo