గురువారం 28 మే 2020
Telangana - May 13, 2020 , 14:02:01

పోలీసుల స్పందనకు వందనం

పోలీసుల స్పందనకు వందనం

సూర్యాపేట: పోలీసులంటే ప్రజల్లో ఓ రమైన భయం ఏర్పడింది. విధుల్లో వారు కరుగా ఉంటారని చాలా మంది భావిస్తుంటారు. కరుకుదనమే కాదు వారిలో కూడా మానవీయ కోణం ఉంటుందని ఇలాంటి ఘటనలు చూసినప్పుడు అర్థమవుంతుంటుంది. కరోనా నేపథ్యంలో వలస కూలీల జీవితాలు ఎంత దుర్భంగా ఉంటున్నాయో చూస్తునే ఉన్నాం. ఆపన్న హస్తం కోసం నేడు ఎంతో మంది ఎదురు చూస్తున్నారు. ఇలాంటి సమయంలో ఒక్క ఫోన్‌ కాల్‌కు స్పందించిన పోలీసులు వలస కూలీల ఆకలి తీర్చి తమ ఔదార్యాన్ని చాటారు సూర్యాపేట పోలీసులు.

లాక్ డౌన్ సందర్బంగా పని లేకపోవడంతో నిత్యావసరాలు లేక ఇబ్బందులు పడుతూ సరుకులు అందజేయాలని జిల్లా పోలీసు కార్యాలయానికి ఒడిశాకు చెందిన వలస కూలీలు ఫోన్ చేశారు. స్పందించిన ఎస్ పీ  వెంటనే సరుకులు అందించాలని స్థానిక స్థానిక డీఎస్పీ మోహన్ కుమార్ ని ఆదేశించారు.  డీఎస్పీ సూర్యాపేట పట్టణంలో అలంకార్ సెంటర్ లో సామాజిక సేవా కార్యకర్త జాన్ ఫాదర్ గారితో కలిసి వలస కూలీలకు నిత్యావసర సరుకులు అందించారు. logo