సోమవారం 01 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:53:41

కరోనా డాక్టర్‌కి జేజేలు

కరోనా డాక్టర్‌కి జేజేలు

కొవిడ్‌-19 రోగులకు సేవలందించిన వైద్యురాలికి స్థానికుల నుంచి అరుదైన గౌరవం లభించింది. మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా యాప్రాల్‌లోని ఓంశ్రీ గ్రీన్‌పార్క్‌ అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వైద్యురాలు విజయశ్రీ.. 15 రోజులపాటు గాంధీ దవాఖానలో కరోనా రోగులకు వైద్యసేవలందించారు. శనివారం తిరిగి ఇంటికి చేరుకున్నారు. ఈ సమయంలో విజయశ్రీకి అపార్ట్‌మెంట్‌వాసులు చప్పట్లతో ఘనస్వాగతం పలికారు. దీంతో ఆమె ఒక్కసారిగా భావోద్వేగానికి గురయి ఆనందబాష్పాలు రాల్చారు. 

- మల్కాజిగిరి, నేరేడ్‌మెట్‌, నమస్తే తెలంగాణ


logo