గురువారం 28 మే 2020
Telangana - May 03, 2020 , 11:04:04

హైదరాబాద్‌ పోలీసులకు సెల్యూట్‌: సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌ పోలీసులకు సెల్యూట్‌: సీపీ అంజనీ కుమార్‌

హైదరాబాద్‌: కరోనా వారియర్స్‌ ప్రాణాలను పణంగా పెట్టి విధులు నిర్వర్తిసున్నారని హైదరాబాద్‌ సీపీ అంజనీ కుమార్‌ అన్నారు. కరోనాపై పోరాడుతున్న గాంధీ ఆస్పత్రి వైద్యులు, నర్సులు, పోలీసులు, పారిశుద్ధ్య సిబ్బందిపై భారత వాయుసేన పూల వర్షం కురిపించింది. ఈ కార్యక్రమంలో సీపీ అంజనీ కుమార్‌ పాల్గొన్నారు. కరోనా యోధులు సమాజానికి, కరోనాకు మధ్య వారధిలా ఉన్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా కరోనాతో పోరాడుతున్నారని వెల్లడించారు. హైదరాబాద్‌ పోలీసులకు సెల్యూట్‌ చేస్తున్నానని, వారు 24 గంటలు విధులు నిర్వర్తిస్తూ రక్షణ కల్పిస్తున్నారని తెలిపారు. కరోనాను అరికట్టాలాంటే ప్రజలు తప్పనిసరిగా లాక్‌డౌన్‌ పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు.


logo