శనివారం 16 జనవరి 2021
Telangana - Jan 02, 2021 , 00:03:41

న్యూ ఇయర్‌ కిక్కు 194 కోట్లు!

 న్యూ ఇయర్‌ కిక్కు 194 కోట్లు!

  • డిసెంబర్‌ 31న మూడురెట్లు పెరిగిన అమ్మకాలు 

హైదరాబాద్‌, జనవరి 1 (నమస్తే తెలంగాణ): మద్యం ప్రియులు పండుగ చేసుకున్నారు. కొత్త సంవత్సర వేడుకలకు ‘ఫుల్‌'జోష్‌లో వెల్‌కమ్‌ చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్‌ 31 ఒక్కరోజే రూ.194కోట్ల విలువైన మద్యం అమ్మకాలు జరిగినట్టు సమాచారం. సాధారణ రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా రోజుకు సగటున రూ.70 కోట్ల వరకు మద్యం అమ్మకాలు జరుగుతుంటాయి. గురువారం మాత్రం సాధారణం కంటే మూడు రెట్ల వరకు మద్యం విక్రయించినట్టు తెలిసింది. నూతన సంవత్సర వేడుకలను పురస్కరించుకుని ప్రభుత్వం మద్యం దుకాణ వేళలను సైతం గంటపాటు అదనంగా పెంచిన విషయం తెలిసిందే. గురువారం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం విక్రయాలు కొనసాగాయి. వాస్తవానికి మద్యం అమ్మకాలు మరింత పెరుగుతాయని అంచనాలున్నప్పటికీ.. కొవిడ్‌ కారణంగా కొంత తగ్గాయని మద్యం దుకాణాదారులు చెప్పారు.