బుధవారం 03 జూన్ 2020
Telangana - Mar 28, 2020 , 16:50:43

సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా గవర్నర్ తమిళిసై నెల జీతం

సీఎం రిలీఫ్ ఫండ్ కు విరాళంగా గవర్నర్ తమిళిసై నెల జీతం

తెలంగాణ రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తన ఒక నెల జీతాన్ని కరోనాపై పోరుకు విరాళంగా ఇస్తున్నట్టు ప్రకటించారు. రాష్ట్ర ప్రథమ పౌరురాలిగా కరోనా మహ‌మ్మారిపై పోరులో రాష్ట్ర ప్రజలందరికి మద్దతుగా నిలుస్తున్నట్లు  ట్విట్టర్ లో ట్వీట్ చేశారు. ఇందుకోసం తన వంతు భాగస్వామ్యంగా ఒక నెల వేతనాన్ని సీఎం రిలీఫ్ ఫండ్ కు చెక్ రూపంలో అందించనున్నట్లు గవర్నర్ తమిళిసై ట్వీట్ చేశారు. కరోనా ప్రభావంతో తెలంగాణలో లాక్ డౌన్ ను మరింత కఠినంగా అమలు చేస్తున్నారు. పాజిటివ్ కేసులు పెరగకుండా కట్టుదిట్టమైన జాగ్రత్తలు చేపడుతోంది తెలంగాణ రాష్ట్ర‌ ప్రభుత్వం. అటు రాష్ట్రంలో ఇప్ప‌టి వ‌ర‌కు  59 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోద‌య్యాయి.


logo