బుధవారం 27 మే 2020
Telangana - May 08, 2020 , 01:14:21

41 మంది పాఠశాల సిబ్బందికి వేతనం

41 మంది పాఠశాల సిబ్బందికి వేతనం

  • కావేరీ సీడ్స్‌ అధినేత భాస్కర్‌రావు ఉదారత

భీమదేవరపల్లి: కావేరీ సీడ్స్‌ అధినేత గుండవరం భాస్కర్‌రావు మరోసారి ఉదారతను చాటుకున్నారు. వరంగల్‌ అర్బన్‌ జిల్లా భీమదేవరపల్లి మండలంలోని గట్లనర్సింగాపూర్‌ ప్రభుత్వ ప్రాథమిక, ఉన్నత పాఠశాలలకు రూ.4 కోట్ల వ్యయంతో పక్కా భవనాలు నిర్మించి ఇచ్చిన ఆయన.. పాఠశాలల్లో పనిచేస్తున్న 25 మంది ప్రైవేటు ఉపాధ్యాయులు, 16 మంది ఇతర సిబ్బందికి ఏప్రిల్‌ నెలకు సంబంధించిన వేతనం రూ.5.08 లక్షలు చెల్లించారు. పాఠశాలలు మూసి ఉన్నప్పటికీ తమకు వేతనాలందించిన భాస్కర్‌రావు-వనజ దంపతులకు సిబ్బంది కృతజ్ఞతలు తెలిపారు. logo