ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Aug 16, 2020 , 02:02:51

కరోనా యోధులకు సలాం

కరోనా యోధులకు సలాం

  • మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత వీడియో సందేశం

ఖలీల్‌వాడి: తమ ప్రాణాలను సైతం లెక్కచేయకుండా కరోనా మహమ్మారిపై పోరాడుతున్న ఫ్రంట్‌ లైన్‌ వారియర్స్‌కు నిజామాబాద్‌ మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత ధన్యవాదాలు తెలిపారు. 74వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శనివారం ఆమె రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఏటా పంద్రాగస్టు దేశప్రజలందరికీ పండుగనీ, కానీ, ఈసారి కరోనా   నేపథ్యంలో ప్రత్యేక పరిస్థితుల్లో జరుపుకొన్నట్లు తెలిపారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర సమరయోధులు, జాతి నిర్మాతలను స్మరించుకునేవారమని.. ఈసారి కరోనా మహమ్మారి పై పోరాడుతున్న యోధులనుసైతం గుర్తు చేసుకుంటున్నట్లు చెప్పారు. విపత్కర పరిస్థితుల్లో  దేశ రక్షణ కోసం సైనికులు పనిచేస్తున్నారని గుర్తుచేశారు. ప్రజల సంక్షేమం కోసం అహర్నిశలు కృషి చేస్తున్న ఉద్యోగులైనా, సీఎం అయినా, రాష్ట్రపతి అయినా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా వారికి ధన్యవాదాలు చెప్పాలన్నారు. కరోనా నేపథ్యంలో 1300 కిలోమీటర్ల  దూరం తండ్రిని సైకిల్‌మీద తీసుకెళ్లిన ఆడబిడ్డను, కరోనా నుంచి కోలుకుని ప్లాస్మాదానం చేస్తున్న మహనుభావులను, అనేక మందికి అన్నదానం చేస్తున్న వారి సేవలు మరిచిపోలేనివని గుర్తుచేశారు.