సోమవారం 01 మార్చి 2021
Telangana - Jan 20, 2021 , 01:26:55

యాదాద్రికి సాలహార విగ్రహాలు

యాదాద్రికి సాలహార విగ్రహాలు

ఆలేరు :ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆలోచనల మేరకు యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ పునర్నిర్మాణ పనులు ఆధ్యాత్మికత ఉట్టిపడేలా సాగుతున్నాయి. స్వామివారి ప్రధాన ఆలయంలోని ప్రాకారాలను చూసే భక్తులు తన్మయత్వం చెందేలా నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఆలయం ద్వితీయ ప్రాకారం వెలుపల సాలహారాల్లో మొత్తం 140 విగ్రహాలను అమర్చాలని వైటీడీఏ అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా కోయిలకుంటలో ఏకశిలలతో సాలహార విగ్రహాలను ప్రత్యేకంగా తయారు చేయించారు. మంగళవారం ఉదయం 32 సాలహార విగ్రహాలను యాదాద్రి క్షేత్రానికి తరలించారు. మిగతా 108 విగ్రహాలను సైతం త్వరలో తీసుకురానున్నట్టు ఆలయ అధికారులు వెల్లడించారు. కాగా, సాలహార విగ్రహాలను అమర్చే పనులు త్వరలో చేపట్టనున్నట్టు వైటీడీఏ అధికారులు పేర్కొన్నారు. 

VIDEOS

logo