గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 16:22:13

పారిశుద్ధ్య కార్మికులకు సలాం.. మంత్రి అల్లోల

పారిశుద్ధ్య కార్మికులకు సలాం.. మంత్రి అల్లోల

నిర్మల్‌: కరోనా నియంత్రణకు వైద్యులు, పోలీసులతోపాటు పారిశుద్ధ్యకార్మికులు నిరంతరం శ్రమిస్తున్నారని, వారి సేవలకు సలాం చేస్తున్నాని దేవాదాయ శాఖ మంత్రి అల్లో ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. శుక్రవారం ఆయన నిర్మల్‌ పట్టణంలో లాక్‌డౌన్‌ అమలును పరిశీలించారు. పేదలు, వలస కార్మికుల సమస్యలను తెలసుకుని ప్రభుత్వం తరపున సాయం చేస్తామని హామీ ఇచ్చారు. కరోనా నియంత్రణకు మున్సిపల్‌ సిబ్బంది, పారిశుద్ధ్య కార్మికులు చేస్తున్న సేవలకుగాను వారిని శాలువాతో సత్కరించారు. అనంతరం వారితో కలసి భోజనం చేశారు. లాక్‌డౌన్‌ సమయంలో పగలు, రాత్రి తేడాలేకుండా పట్టణాన్ని పారిశుద్ధ్యకార్మికులు పరిశుభ్రంగా ఉంచుతున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు. కష్టకాలంలో పనిచేస్తున్నందుకు ప్రభుత్వం ఎప్పుడు అండగా ఉంటుందని చెప్పారు. 


logo