బుధవారం 02 డిసెంబర్ 2020
Telangana - Oct 20, 2020 , 01:30:12

సఖీ కేంద్రాలు మరింత బలోపేతం: మంత్రి సత్యవతి

సఖీ కేంద్రాలు మరింత బలోపేతం: మంత్రి సత్యవతి

హైదరాబాద్‌,  నమస్తే తెలంగాణ: సఖీ కేంద్రాల బలోపేతానికి ప్రత్యేక కార్యాచరణ చేపట్టినట్టు రాష్ట్ర గిరిజన, మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చెప్పారు. సోమవారం తన కార్యాలయంలో వివిధ అంశాలపై మంత్రి సమీక్షించారు. స్వచ్ఛంద సంస్థలు నిర్వహిస్తున్న సఖీ కేంద్రాల్లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ అధికారిని నియమించాలని నిర్ణయించినట్టు ఆమె తెలిపారు. వివిధ సమస్యలతో వచ్చే బాధితులకు కౌన్సెలింగ్‌ ఇచ్చేందుకు రిటైర్డ్‌ అధికారులు, సీనియర్‌ న్యాయవాదులను నియమించనున్నట్టు చెప్పారు. పోలీసుశాఖ నుంచి ఒక అధికారిని కేటాయించాలని ప్రభుత్వాన్ని కోరినట్టు మంత్రి పేర్కొన్నారు.