శనివారం 28 నవంబర్ 2020
Telangana - Nov 10, 2020 , 03:13:25

14 నుంచి సాగర్‌- శ్రీశైలం లాంచీ

14 నుంచి సాగర్‌- శ్రీశైలం లాంచీ

 హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/నందికొండ: కృష్ణానదిలో నాగార్జునసాగర్‌- శ్రీశైలం లాంచీ ప్రయాణం ఈ నెల 14 నుంచి పునఃప్రారంభం కానున్నది. కరోనా తగ్గుముఖం పట్టడంతో లాంచీని ప్రారంభించాలని తెలంగాణ రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ నిర్ణయించింది. నాగార్జునసాగర్‌ బోటింగ్‌ యూనిట్‌లో ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి వచ్చే టూరిస్ట్‌ల కోసం టూరిజంశాఖ ప్రత్యేక ప్యాకేజీ ఇస్తున్నది. సందర్శకులను బస్సులో హైదరాబాద్‌ నుంచి సాగర్‌కు తీసుకొస్తారు. అక్కడ్నుంచి లాంచీ ద్వారా శ్రీశైలం తీసుకెళ్తారు. శ్రీశైలం నుంచి తిరిగి టూరిజం బస్సులో హైదరాబాద్‌ చేరుస్తారు. ఈ ప్యాకేజీ పెద్దలకు రూ.3,050, పిల్లలకు 2,450గా నిర్ణయించారు. సాగర్‌ నుంచి శ్రీశైలం లేదా శ్రీశైలం నుంచి నాగార్జునసాగర్‌కు లాంచీలో ప్రయాణించేవారికి వన్‌వేకింద పెద్దలకు రూ. 1,000, పిల్లలకు రూ.800గా నిర్ణయించారు. వివరాలకు హైదరాబాద్‌లోని రిజర్వేషన్‌ ఇన్ఫర్మేషన్‌ కౌంటర్‌ 9848540371 లేదా సాగర్‌లోని లాంచీ యూనిట్‌ మేనేజర్‌ 7997951023 నంబర్లను సంప్రదించి తెలుసుకోవచ్చు. www.tstdc.in ద్వారా ఆన్‌లైన్‌లోనూ బుక్‌చేసుకోవచ్చు.