శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 02, 2020 , 01:16:28

కేసీఆర్‌ కిట్‌తో సురక్షిత ప్రసవాలు

కేసీఆర్‌ కిట్‌తో సురక్షిత ప్రసవాలు

  • పోషకాహార మాసోత్సవంలో గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: తెలంగాణలో కేసీఆర్‌ కిట్‌, తమిళనాడులో అమ్మ బేబీకేర్‌ కిట్‌ వల్ల సురక్షిత ప్రసవాలు పెరిగాయని గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ అన్నారు. మంగళవారం శ్రీరామచంద్ర ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హయ్యర్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రిసెర్చ్‌ (శ్రీహేర్‌) నిర్వహించిన జాతీయ పోషకాహార మాసోత్సవంలో వెబినార్‌ ద్వా రా ప్రారంభోపన్యాసం చేశారు. 2022 నాటికి పోషకాహార లోపంలే ని దేశాన్ని తీర్చిదిద్దేందుకు అందరూ  చేతులు కలపాలని చెప్పారు. ‘పోషణ్‌అభియాన్‌'కు ప్రధాని రూ.9 వేల కోట్లు కేటాయించారని తెలిపారు. సంప్రదాయ ఆహారమే రోగనిరోధక శక్తిని ఇస్తుందని చెప్పారు. తాను చిన్నతనంలో తాటి బెల్లం తినేదానినని, అది పోషకాహారమని తన అమ్మమ్మ చెప్పినట్టు పేర్కొన్నారు. నేడు తల్లిదండ్రులు తమ పిల్లలకు జంక్‌ఫుడ్‌ ఇవ్వడం బాధాకరమని అభిప్రాయపడ్డారు. ఈ వెబినార్‌లో శ్రీహేర్‌ వైస్‌చాన్స్‌లర్‌ పీ విజయరాఘవన్‌, ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ సెంథిల్‌కుమార్‌, క్లినికల్‌ న్యూట్రిషన్‌ విభాగం డాక్టర్‌ ఏజే హేమమాలిని తదితరులు పాల్గొన్నారు.


logo