గురువారం 03 డిసెంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 01:35:29

బెంగాల్‌, యూపీలోనూ పోటీ: అసద్‌

బెంగాల్‌, యూపీలోనూ పోటీ: అసద్‌

ప్రత్యేక ప్రతినిధి, నమస్తే తెలంగాణ: బీహార్‌ శాసనసభ ఎన్నికల్లో సత్తా చాటిన  ఎంఐఎం పార్టీ జాతీయ రాజకీయాల్లో పట్టు సాధించేందుకు  ప్రయత్నిస్తున్నది.. హైదరాబాద్‌ కేంద్రంగా రాజకీయ కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఆ పార్టీ త్వరలో జరుగనున్న బెంగాల్‌ ఎన్నికల బరిలోకి దిగేందుకు సిద్ధమని ప్రకటించింది. ఆ తరువాత 2022లో జరుగనున్న ఉత్తరప్రదేశ్‌ ఎన్నికలలో కూడా పోటీ చేయనున్నామని వెల్లడించింది. దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా పోటీ చేసేందుకు ప్రయత్నిస్తామని ఆ పార్టీ  అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ స్పష్టంచేశారు. తమ పార్టీ ఎవరికీ తోకలా వ్యవహరించదని, అట్టడుగు, బడుగు వర్గాలు, మైనార్టీల పక్షా న పోరాడుతుందన్నారు. బీహార్‌లో గెలుపొందిన ఎంఐఎం ఎమ్మెల్యేలు హైదరాబాద్‌కు చేరుకున్నారు.