మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Oct 24, 2020 , 22:22:07

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ

రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా సద్దుల బతుకమ్మ

హైదరాబాద్‌: రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు శనివారం సద్దుల బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నారు. ఆడబిడ్డలు తీరొక్కపూలతో బతుకమ్మలు పేర్చి, పాటలకు పాదం కలిపారు. ఎంగిలిపూలతో మొదలైన వేడుకలు సద్దులతో ముగిశాయి. పల్లెలు, పట్టణాలు, నగరాలు పూలవనాల్లాగా మారిపోయాయి. ఆడబిడ్డలు బతుకమ్మలను నిమజ్జనం చేసి, వాయినాలు ఇచ్చిపుచ్చుకున్నారు. కుటుంబ సభ్యులతో సద్దులు ఆరగించి, ఇంటిబాటపట్టారు. కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ బతుకమ్మ ఆడిన ఆడబిడ్డలు.. వచ్చే ఏడాదికల్లా మహమ్మారి కనిపించకుండా పోవాలని గౌరమ్మను వేడుకున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.