గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 11:10:15

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి

పరీక్ష కేంద్రాలను పరిశీలించిన సబితా ఇంద్రారెడ్డి

రంగారెడ్డి/ హైదరాబాద్‌: రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఈ రోజు 10వ తరగతి పరీక్ష కేంద్రాలను పరిశీలించారు. బోరబండ, యూసుఫ్‌గూడ పరీక్ష కేంద్రాల్లో పర్యటించారు. విద్యార్థులకు అత్యంత భద్రత మధ్య కరోనా వైరస్‌ విస్తరించకుండా సీటింగ్‌ సదుపాయం కల్పించారా అని విధులు నిర్వహిస్తున్న సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. 

విద్యార్థులు, టీచర్లకు ఏర్పాటు చేసిన బెంచీలు, కుర్చీలు డెటాల్‌తో శుభ్రంగా తుడవాలని ఆదేశించారు. విద్యార్థులు కూడా ఎప్పటికప్పుడు శుభ్రంగా శానిటైజర్‌తో గాని, సబ్బుతో గాని, ఇతర లిక్విడ్‌లతో శుభ్రం చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులకు మాస్క్‌లు, వాటర్‌ బాటిల్‌ శానిటైజర్లను క్లాస్‌ రూమ్‌లోకి అనుమతించాలని ఆదేశించారు. logo
>>>>>>