బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 29, 2020 , 03:15:42

అరుదైన రాజనీతిజ్ఞుడు జైపాల్‌రెడ్డి

అరుదైన రాజనీతిజ్ఞుడు జైపాల్‌రెడ్డి

  • ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు
  • పదిభావజాలాలు పుస్తకావిష్కరణ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దివంగతనేత ఎస్‌ జైపాల్‌రెడ్డి అరుదైన రాజనీతిజ్ఞుడని ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు కొనియాడారు. జైపాల్‌రెడ్డికి.. విద్యార్థి దశనుంచే విస్తృత అధ్యయనంచేసే ఆసక్తి ఉన్నదని, జాతీయ, అంతర్జాతీయ అంశాలపై చక్కటి అవగాహన పెంచుకున్నారని చెప్పారు. ప్రతి విషయాన్ని సైద్ధాంతికంగా, కార్యాకారణ సంబంధాలతో, లాజికల్‌గా ఆలోచించడం జైపాల్‌రెడ్డి ప్రత్యేకతని పేర్కొన్నారు. జైపాల్‌రెడ్డి రాసిన ‘ది టెన్‌ ఐడియాలజీస్‌' పుస్తక తెలుగు అనువాదం ‘పది భావజాలాలు’ను మంగళవారం ఢిల్లీలో ఆన్‌లైన్‌ వేదిక ద్వారా ఉపరాష్ట్రపతి ఆవిష్కరించారు.


logo