ఆదివారం 06 డిసెంబర్ 2020
Telangana - Nov 03, 2020 , 18:46:54

ఈ 6న ప్రొఫెస‌ర్ ఎస్‌. బ‌షీరుద్దీన్ స్మార‌క ఉప‌న్యాసం

ఈ 6న ప్రొఫెస‌ర్ ఎస్‌. బ‌షీరుద్దీన్ స్మార‌క ఉప‌న్యాసం

హైద‌రాబాద్ : ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ పదహారవ స్మార‌క‌ ఉపన్యాసం ఈ నెల 6వ తేదీన జ‌ర‌గ‌నుంది. ప్రొఫెసర్ ఎస్. బషీరుద్దీన్ మెమోరియల్ ట్రస్ట్, ఉస్మానియా జర్నలిజం అలుమ్ని అసోసియేషన్, అడ్వర్టైజింగ్ క్లబ్- హైదరాబాద్, పబ్లిక్ రిలేషన్స్ సొసైటీ ఆఫ్ ఇండియా, హైదరాబాద్ చాప్టర్, ఉస్మానియా విశ్వవిద్యాలయం కమ్యూనికేషన్ అండ్‌ జర్నలిజం విభాగం సంయుక్తంగా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హిస్తుంది. కేంద్ర స‌మాచార మాజీ క‌మిష‌న‌ర్, డీన్ స్కూల్ ఆఫ్ లా(బెన్నెట్ యూనివ‌ర్సిటీ) ప్రొఫెస‌ర్ మాడ‌భూషి శ్రీ‌ధ‌ర్ క్ర‌మ‌ర‌హిత‌ మీడియా, ఇంపాజిబుల్ రెగ్యులేష‌న్ అనే అంశంపై స్మార‌క ఉప‌న్యాసం చేయ‌నున్నారు. ‌