గురువారం 26 నవంబర్ 2020
Telangana - Feb 22, 2020 , 15:53:08

రైతు బంధు నిధులు అందరికీ అందుతున్నాయి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

రైతు బంధు నిధులు అందరికీ అందుతున్నాయి: మంత్రి నిరంజన్‌ రెడ్డి

హైదరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం.. రైతులకు పంట పెట్టుబడి నిమిత్తం అందిస్తున్న రైతు బంధు నిధులు దాదాపు అందరికీ అందుతున్నాయని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి అన్నారు. రైతు బంధు నిధులు.. రైతుల ఖాతాలోనే డైరెక్టుగా జమ చేస్తున్నామని ఈ సందర్భంగా మంత్రి అన్నారు. కొన్ని చోట్ల మాత్రమే సాంకేతిక లోపం కారణంగా నిధులు బ్యాంకు అకౌంట్లకు బదిలీ కావడం లేదనీ.. ఈ లోపాన్ని త్వరలోనే అధిగమించి, ప్రతి రైతుకు రైతు బంధు నిధులు అందేలా కృషి చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. అందుకోసం ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసి, రైతుల సమస్యలు పరిష్కరిస్తామని ఈ సందర్భంగా మంత్రి వెల్లడించారు. రైతుబంధు సీలింగ్‌పై ప్రభుత్వం ఇప్పటివరకు ఆలోచన చేయలేదనీ.. పంట రుణాలకు సంబంధిత స్కేల్‌ ఆఫ్‌ ఫైనాన్స్‌ పెంచాలని కేంద్రాన్ని కోరామన్నారు. రైతుబంధుతో రాష్ట్రంలో ఆత్మహత్యలు తగ్గాయని మంత్రి తెలిపారు. రైతు బంధుకు సంబంధించి, రైతు ఆత్మహత్యల గురించి ఆరోపణలు చేసే విపక్షనేతలు ఆధారాలు చూపించాలని మంత్రి సవాలు విసిరారు.