శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 00:14:33

నూతన విప్లవానికి నాంది రైతువేదికలు

నూతన విప్లవానికి నాంది రైతువేదికలు

  • వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి 

అచ్చంపేట: వ్యవసాయ రంగంలో తెలంగాణ దేశానికే తలమానికం కావాలన్నదే సీఎం కేసీఆర్‌ లక్ష్యమనీ, రాను న్న రోజుల్లో నూతన విప్లవానికి రైతువేదికలు నాంది పలుకుతాయని వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా అచ్చంపేట, ఉప్పునుంతలలో నూతనంగా నిర్మించిన 5 వేల మెట్రిక్‌ టన్నుల గోదాంలను విప్‌ గువ్వల బాలరాజు, ఎమ్మెల్సీ కసిరెడ్డి నారాయణరెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం పట్టణంలోని ఓ ఫంక్షన్‌హాల్‌లో కొరటికల్‌, రంగాపూర్‌, పల్కపల్లి, కొండనాగుల, తిమ్మాయిపల్లి, డిండిచింతపల్లిలో నిర్మించనున్న రైతు వేదికల నిర్మాణాలకు శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. తెలంగాణ అన్నిరకాల పంటల సాగుకు అనువైందన్నారు. దశాబ్దాల క్రితమే సీఎం కేసీఆర్‌ లాంటి నిర్ణయాలు తీసుకొంటే ప్రపంచానికి భారత్‌ అన్నపూర్ణగా నిలిచేదన్నారు. కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టులకు కేంద్రం జాతీయహోదా, నిధులు ఇచ్చి చేయూత నివ్వాల్సిన బాధ్యతను కేంద్రం విస్మరించిందన్నారు.  

రైతుల ఆర్థికాభివృద్ధే లక్ష్యం: మంత్రి జగదీశ్‌రెడ్డి


రైతులు ఆర్థికంగా ఎదగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి అన్నారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణపురం, నల్లగొండ జిల్లా మునుగోడు, చండూరు మండలం బంగారిగడ్డ, నాంపల్లి, మర్రిగూడలో రైతువేదికల నిర్మాణాలకు మంగళవారం మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవాలయాల్లా రైతు వేదికల నిర్మాణం చేపడుతున్నామన్నారు. ఎంపీ బడుగుల లింగయ్యయాదవ్‌, మండలి విప్‌ కర్నెప్రభాకర్‌, యాదాద్రిభువనగిరి జెడ్పీచైర్మన్‌ ఎలిమినేటి సందీప్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

పవిత్ర దేవాలయాలుగా రైతు వేదికలు: మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌

రైతు వేదికలు పవిత్ర దేవాలయాలుగా నిలుస్తాయని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ పేర్కొన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం అడవిమల్లేల గ్రామంలో రైతు వేదిక భవన నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం పెనుబల్లి మండలంలోని లంకాసాగర్‌ మైనర్‌ ప్రాజెక్టు నుంచి నీటిని విడుదల చేశారు.  


logo