రైతు వేదికలు విజ్ఞాన కేంద్రాలుగా మారాలి : మంత్రి నిరంజన్ రెడ్డి

జగిత్యాల : రైతు వేదికలు.. రైతు విజ్ఞాన కేంద్రాలుగా మారాలని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ పరిధిలోని మొగలిపేట, దామ్రాజ్ పల్లి, మల్లాపూర్, గూడూర్, వేముకూర్తి, వర్షకొండ, ఇబ్రహీంపట్నం, మల్లాపూర్ గ్రామాల్లో నూతనంగా నిర్మించిన రైతు వేదికలను సంక్షేమశాఖల మంత్రి కొప్పుల ఈశ్వర్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశంలో రైతువేదికలు నిర్మించిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని గుర్తుచేశారు. వ్యవసాయరంగ బలోపేతానికి సీఎం కేసీఆర్ అనేక పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు.
రైతుబంధు, రైతుబీమా, ఉచిత విద్యుత్, సబ్సిడీపై ఎరువులు, విత్తనాలు ఇచ్చి అన్నదాతలకు వెన్నుదన్నుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. రైతుబంధు పథకం కింద రాష్ట్రంలోని 59.21 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7357.02 కోట్ల జమచేసినట్లు తెలిపారు. రైతువేదికల ద్వారా అన్నదాతలకు సాగులో మెళకువలు, పంట సాగు విధానాలు తదితర అంశాలపై అవగాహన కల్పిస్తామని చెప్పారు. అన్నంపెట్టే రైతు శాసించే స్థితిలో ఉండాలి కానీ యాచించే దుస్థితి రావద్దన్న సీఎం కేసీఆర్ స్వప్నాన్ని నిజం చేస్తామన్నారు.
అనంతరం మంత్రి కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతు ప్రభుత్వమని అన్నారు. భవిష్యత్తులో రైతు వేదికలు అన్నదాతలకు చాలా ఉపయుక్తంగా ఉండబోతున్నాయని చెప్పారు. వ్యవసాయ రంగంలో వస్తున్న మార్పులపై చర్చించుకునేందుకు రైతు వేదికలను అన్ని సదుపాయాలతో నిర్మించినట్లు చెప్పారు. కార్యక్రమంలో జడ్పీ చైర్పర్సన్ దావ వసంత, స్థానిక ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.
లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
తాజావార్తలు
- ఊబకాయం అనేక రుగ్మతలకు మూల కారణం
- మిరియాలతో బరువు ఎలా తగ్గవచ్చంటే..?
- బెంగాల్ పోరు : తృణమూల్‌లో నటులు, సెలబ్రిటీల చేరిక!
- ఆకాశంలో తేలుతున్న ఓడ.. ఫొటో వైరల్
- ఏపీలో కొత్తగా 102 కరోనా కేసులు
- నవీన్, ప్రియదర్శిలను ప్రభాస్ ఇంట్లోకి రానివ్వని సెక్యూరిటీగార్డు..వీడియో
- దిగొస్తున్న బంగారం.. మున్ముందు కింది చూపులేనా?!
- మమతా దీదీ.. రాయల్ బెంగాల్ పులి: నెత్తికెత్తుకున్న శివసేన
- కనిపించినవాళ్లను కాల్చేస్తా.. టిక్‌టాక్‌లో సైనికుల బెదిరింపు
- పీఎఫ్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవడం ఎలా