మంగళవారం 14 జూలై 2020
Telangana - Jun 25, 2020 , 15:15:39

మూడు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి : సీఎం కేసీఆర్‌

మూడు నెలల్లో రైతు వేదికల నిర్మాణం పూర్తి : సీఎం కేసీఆర్‌

మెదక్‌ : వచ్చే మూడు నెలల్లో రైతు వేదికల నిర్మాణాలు పూర్తి కావాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. మెదక్‌ జిల్లా నర్సాపూర్‌లో ఆరో విడత హరితహారం కార్యక్రమాన్ని సీఎం నేడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేసీఆర్‌ పాల్గొని మాట్లాడారు. దేశంలో 55 శాతం ధాన్యం తెలంగాణలోనే పండిందన్నారు. ఎవరి వద్ద లేని డబ్బు తెలంగాణ రైతుల వద్ద ఉందన్నారు. రైతుబంధు సాయాన్ని రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. 

రైతు బాగుపడితే రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. రైతు వద్ద డబ్బు ఉంటే గ్రామాలు గ్రామాలు బాగుపడుతాయన్నారు. రైతులు సంఘటితమై నియంత్రిత సాగు విధానాన్ని అవలంభించి ఆర్థికంగా అభివృద్ది చెందాలన్నారు. మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న పంటలే రైతులు పండించాలన్నారు. నియంత్రిత సాగు విధానంతో అద్భుతమైన ఫలితాలు వస్తాయన్నారు. దేశంలో ఏ రాష్ట్రంలో రైతులకు లేని సదుపాయాలు రాష్ట్ర రైతులకు అందిస్తున్నట్లు తెలిపారు. తెలంగాణ రైతులు దేశానికే ఆదర్శంగా నిలవాలన్నారు.   రాష్ర్టాభివృద్ధికి ప్రభుత్వం వేయాల్సిన ప్రతి అడుగు వేస్తోందని.. ప్రజల నుంచి సహకారం కోరుతున్నట్లు సీఎం పేర్కొన్నారు.


logo