సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 20, 2020 , 19:08:15

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు : మంత్రి నిరంజన్‌రెడ్డి

వనపర్తి : రైతుల సంఘటితం కోసమే రైతు వేదికలు నిర్మాణం చేపట్టినట్లు రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి నిరంజన్‌ రెడ్డి తెలిపారు. వనపర్తి జిల్లాలోని పాంగల్‌, వనపర్తి రైతు వేదికలను తన తల్లిదండ్రుల పేరుతో సొంత ఖర్చులతో నిర్మించనున్నట్లు వెల్లడించారు. వనపర్తి మండలంలో రైతు వేదికలకు మంత్రి శనివారం శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మంత్రి  మాట్లాడుతూ... రైతు వేదికల నిర్మాణం సీఎం కేసీఆర్‌ కల అన్నారు. వచ్చే దసరా పండుగ నాటికి రైతు వేదికలు ప్రారంభం అవుతాయన్నారు. 60 లక్షల రైతు కుటుంబాలను ఏకం చేసే ప్రయత్నం జరుగుతోందన్నారు. సమిష్టి నిర్ణయాలకు ఇవి వేదికలని మంత్రి పేర్కొన్నారు. 


logo