బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 13:06:40

వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచడానికే రైతువేదికలు

వ్యవసాయ విజ్ఞానాన్ని పెంచడానికే రైతువేదికలు

నల్లగొండ: వ్యవసాయ విజ్ఞానాన్ని పెంపొందించేందుకే ప్రభుత్వం రైతువేదికలను నిర్మిస్తున్నదని మంత్రి జగదీశ్‌ రెడ్డి అన్నారు. రైతువేదికల నిర్మాణాలు దేశానికే తలమానికమని, గిట్టుబాటు ధర నిర్ణయించేందుకు రైతువేదికలు తొలి అడుగని ప్రకటించారు. ఎంపీ లింగయ్యయాదవ్‌, ఎమ్మెల్యేలు నోముల నర్సింహయ్య, కిశోర్‌, భూపాల్‌రెడ్డితో కలిసి నాగార్జున సాగర్‌ నియోజకవర్గంలో రైతు వేదికల నిర్మాణాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. 

వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చాలనేదే సీఎం కేసీఆర్‌ సంకల్పమని చెప్పారు. క్లస్టర్‌ పరిధిలోని రైతాంగాన్ని ఒకే వేదిక మీదకు తీసుకువచ్చి వారిని సంఘటితం చేయవచ్చన్నారు. రైతువేదికల ద్వారా ఏ పంటలకు ఏయే భూములు అనువైనవో రైతుల్లో అవగాహన పెంపొందించవచ్చని తెలిపారు. భూసారం, పోషకాల చర్చకు ఇవి తోడ్పడుతాయాని చెప్పారు. సీఎం కేసీఆర్‌ దార్శనికతకు రైతువేదికలు నిదర్శనమన్నారు. హరితహారంలో భాగంగా ఆయన మొక్కలు నాటారు. 


logo