గురువారం 02 జూలై 2020
Telangana - Jun 13, 2020 , 12:22:51

రైతుల ప్రయోజనాల కోసమే ‘వేదికలు’: మంత్రి పువ్వాడ

రైతుల ప్రయోజనాల కోసమే ‘వేదికలు’: మంత్రి పువ్వాడ

ఖమ్మం: రైతుల ప్రయోజనాల కోసమే రైతు వేదికలు నిర్మిస్తున్నామని మంత్రి పువ్వాడ అజయ్‌ కుమార్‌ అన్నారు. ప్రభుత్వ సూచనల మేరకు రైతులు పంటలను సాగు చేసి మంచి దిగుబడులు సాధించాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలోని బోనకల్లు మండల కేంద్రంలో రైతు వేదిక నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. రైతుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ అహర్నిశలు కృషిచేస్తున్నారని తెలిపారు. అన్నదాతల కోసమే రాష్ట్ర వ్యాప్తంగా రైతువేదికలు నిర్మిస్తున్నామని చెప్పారు.  

అంతకు ముందు ఆయన లాక్‌డౌన్‌ కారణంగా ఆర్థిక ఇబ్బందులకు గురవుతున్న పాస్టర్స్‌కు నిత్యావసరాలను పంపిణీ చేశారు. నిత్యావసరాలను సమకూర్చిన పాస్టర్‌ సత్యపాల్‌ను ఆయన అభినందించారు.  logo