గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 09, 2020 , 03:33:10

సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు

సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు

  • వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

కల్వకుర్తి/ కల్వకుర్తి రూరల్‌: సేద్యం లేకుంటే ప్రపంచమే లేదు.. ప్రపంచానికి దిక్సూచిగా ఉన్న వ్యవసాయరంగానికి తెలంగాణ పెద్ద పీట వేస్తుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. బుధవారం నాగర్‌కర్నూల్‌ జిల్లా కల్వకుర్తి నియోజకవర్గంలో ఎంపీ రాములు, జెడ్పీ చైర్‌పర్సన్‌ పద్మావతి, ఎమ్మెల్యే జైపాల్‌యాదవ్‌, ఎమ్మెల్సీలు కశిరెడ్డి నారాయణరెడ్డి, దామోదర్‌రెడ్డితో కలిసి మంత్రి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించా రు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ నేతృత్వంలో ఆరేండ్లలో తెలంగాణ దేశానికి అన్నపూర్ణ అని చాటి చెప్పేస్థాయికి చేరుకున్నదన్నారు.

రైతులు ఆర్థికంగా బలోపేతం కావాలనే లక్ష్యంతో కేసీఆర్‌ ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నారన్నారు. కల్వకుర్తి నియోజకవర్గంలో ప్రతి ఎకరాకూ సాగునీరు అందించే విధంగా పనులు ముందుకు సాగుతున్నాయని మంత్రి చెప్పారు. ప్రపంచ మార్కెట్‌ వ్యవస్థను ముఖ్యమంత్రి పరిశీలన చేస్తున్నారని, త్వరలో రాష్ట్రంలో పంటల సాగు, మార్కెట్‌ వ్యవస్థకు శ్రీకారం చుట్టే ప్రణాళిక రూపొందించనున్నారని మంత్రి వెల్లడించారు


logo