శనివారం 04 ఏప్రిల్ 2020
Telangana - Mar 06, 2020 , 12:21:57

రైతు సమన్వయ సమితి పేరు మార్పు

రైతు సమన్వయ సమితి పేరు మార్పు

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమ కోసం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతు సమన్వయ సమితి పేరును మార్చాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు గవర్నర్‌ తమిళిసై సౌందర్‌ రాజన్‌ ప్రకటించారు. బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ ప్రసంగించారు. రైతు సమన్వయ సమితి ఇక నుంచి రైతు బంధు సమితిగా మారనుంది అని గవర్నర్‌ తెలిపారు. రైతులను సంఘటితం చేయడమే రైతు బంధు సమితి ఉద్దేశమని చెప్పారు. విత్తనాలు నాటినప్పటి నుంచి పంట చేతికొచ్చిన తర్వాత అమ్ముకునే సమయంలో గిట్టుబాటు ధర కల్పించే వరకు రైతు బంధు సమితి కీలక పాత్ర పోషిస్తుందని గవర్నర్‌ పేర్కొన్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణను ప్రభుత్వం రూపొందిస్తున్నట్లు గవర్నర్‌ తమిళిసై తెలిపారు.


logo