ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:00:12

ప్రతి ఎకరాకు రైతుబంధు

ప్రతి ఎకరాకు రైతుబంధు

  • విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి

కొడంగల్‌ : ప్రతి ఎకరాకు రైతుబంధు అందించాలనేది సీఎం కేసీఆర్‌ ఆకాంక్ష అని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నియోజకవర్గంలోని కొడంగల్‌, బొంరాస్‌పేట మండలాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. రైతుబంధు పథకం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇదివరకే రూ.14వేల కోట్లు విడుదల చేశారన్నారు. ఏ ఒక్క రైతూ రైతుబంధు కోల్పోకుండా ఉండేందుకు మరో రూ.1,000 కోట్లు మంజూరు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రస్తుతం 19 వేల కొత్త పాస్‌బుక్‌లు మంజూరయ్యాయని, వారు కూడా రైతుబంధు కోసం దరఖాస్తు చేసుకొనేందుకు సీఎం అవకాశం కల్పించారన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి పాల్గొన్నారు. 


logo