బుధవారం 27 జనవరి 2021
Telangana - Jan 08, 2021 , 19:47:20

58.87 లక్షల మందికి రైతులకు.. రూ. 7,160.5 కోట్లు జమ

58.87 లక్షల మందికి రైతులకు.. రూ. 7,160.5 కోట్లు జమ

హైదరాబాద్‌ : యాసంగి సీజన్‌కు పంట పెట్టుబడి సాయం కింద రైతులకు అందిస్తున్న రైతుబంధు నగదు పంపిణీ కొనసాగుతున్నది. ఇప్పటివరకు 58.87 లక్షల మందికి రైతులకు ప్రభుత్వం పెట్టుబడి సాయం అందించింది. ఇందుకోసం రూ. 7,160.50 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేసినట్టు వ్యవసాయశాఖ కార్యదర్శి జనార్దన్‌రెడ్డి తెలిపారు. ఇప్పటివరకు 1.43 కోట్ల ఎకరాలకు రైతుబంధు సాయం అందించినట్లు శుక్రవారం పేర్కొన్నారు. నగదు ఖాతాల్లో జమ అవుతుండటంతో పెట్టుబడికి, ఇతరాత్ర ఖర్చులకు కష్టాలు తప్పాయని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo