శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 31, 2020 , 13:34:04

పల్లె ప్రకృతి వనాలు.. ప్రగతికి సోపానాలు

పల్లె ప్రకృతి వనాలు.. ప్రగతికి సోపానాలు

ఆదిలాబాద్ :  ప్రకృతి వనాలను అన్ని గ్రామాల్లో చేపడుతున్నాం. ప్రజలకి ఆహ్లాదాన్ని ఆరోగ్యాన్ని అందిండంలో ప్రకృతి వనాలు ముఖ్య భూమిక పోషిస్తాయని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. మావల మండలంలోని వాగపూర్ గ్రామంలో  రూ.3.84 లక్షలతో ఏర్పాటు చేయనున్న పల్లె ప్రకృతి వనానికి భూమి పూజ చేసి పనులు ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రతి ఒక్కరు మొక్కలు నాటాలని హరితహారంలో భాగస్వాములు కావాలన్నారు. 

ప్రజలందరూ హరిత సైనికునిల్లా పని చేయాలన్నారు. నాటిన ప్రతి మొక్కను బాధ్యతగా సంరక్షించాలన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం క్లస్టర్ల వారీగా రైతువేదికలను నిర్మిస్తుందన్నారు. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా సమయంలో కూడా  రైతు సంక్షేమ పథకాలు కొనసాగిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ఆరె రాజన్న , తదితరులు పాల్గొన్నారు logo