శనివారం 19 సెప్టెంబర్ 2020
Telangana - Sep 14, 2020 , 19:00:59

నెల రోజుల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి

నెల రోజుల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి

నెల రోజుల్లో పల్లె ప్రకృతి వనాలు పూర్తి చేయాలి 

సిద్దిపేట : జిల్లాలోని ప్రతి గ్రామ పంచాయతీలో పల్లె ప్రకృతి వనాలు నెల రోజుల్లో పూర్తి చేయాలని జిల్లా, మండల స్థాయి అధికారులను జిల్లా కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి ఆదేశించారు. సిద్దిపేట, మెదక్‌ జిల్లాల్లో చేపడుతున్న పలు అభివృద్ధి పనుల పై కలెక్టర్‌ వెంకట్రామ్‌రెడ్డి సంబంధిత అధికారులు, అదనపు కలెక్టర్లు, డీఆర్‌డీఏ, డీపీవోలు, ఎంపీడీవోలు, తహసీల్దార్లు, ఆర్డీవోలు, మున్సిపల్‌ కమిషనర్లు, అన్ని మండలాల ప్రత్యేకాధికారులతో హైదరాబాద్‌ నుంచి సోమవారం టెలికాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ వీధి వ్యాపారస్తులకు కరోనా నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న రుణాలను.. జనాభాలో ఐదు శాతం మందికి బ్యాంకుల నుంచి అందే విధంగా ఇంటింటికీ వెళ్లి అప్లికేషన్లు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో రైతువేదికల నిర్మాణాలు త్వరితగతిన చేపట్టి ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. రైతు వేదికలు నిర్మించి ప్రారంభానికి సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. 

అగ్రికల్చర్‌ ఆఫీసర్‌, ఏఈలు, డీఈలు, కాంట్రాక్టర్లు, సంబంధిత అధికారులు రైతువేదికల నిర్మాణం కోసం అవసరమైనటువంటి భూసేకరణ చేసే విధంగా ఆర్డీవో, తహసీల్దార్లు చర్యలు తీసుకోవాలని ప్రతి గ్రామంలో పల్లె ప్రకృతి వనాలు నిర్మించాలని కలెక్టర్‌ ఆదేశించారు. రైతుల కోసం డ్రాయింగ్‌ ప్లాట్‌ ఫామ్స్‌ నిర్మాణాలను 15 రోజుల్లో పూర్తయ్యేలా చర్యలు చేపట్టాలన్నారు. పూర్తయిన వాటికి అందించాల్సినటువంటి బిల్లులు మంజూరు చేయాలని అధికారులను ఆదేశించారు. 

logo