మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 18:29:31

సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో పల్లెల అభివృద్ధి

సీఎం కేసీఆర్‌ ముందు చూపుతో పల్లెల అభివృద్ధి

జగిత్యాల  : ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనలు, పక్కా ప్రణాళికతో గ్రామాల్లో అభివృద్ధి కార్యక్రమాలు జోరుగా కొనసాగుతున్నాయని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ అన్నారు. జిల్లాలోని వెల్గటూర్ మండలం రాంనూర్, ముత్తునూర్, శాఖాపూర్, గ్రామాల్లో రూ. 80 లక్షలతో డీఎమ్‌ఎఫ్టీ నిధులతో చేపట్టనున్న పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ మార్గనిర్దేశంతో పల్లెప్రగతి పథకం ద్వారా గ్రామాల్లో ప్రజలకు అవసరమయ్యే మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తున్నామన్నారు.

పల్లెల్లో నర్సరీలు ఏర్పాటు చేసుకుని పెద్ద ఎత్తున మొక్కల్ని నాటుతున్నామన్నారు. పారిశుద్ధ్యం పనులు ప్రతినిత్యం కొనసాగుతుండటంతో పరిసరాలు పరిశుభ్రంగా మారాయన్నారు. అభివృద్ధి పనులతో పల్లెల్లో పండుగ వాతావరణం నెలకొందన్నారు. కార్యక్రమంలో పెద్దపల్లి ఎంపీ వెంకటేష్ నేత తదితరులు పాల్గొన్నారు.