మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Telangana - Aug 05, 2020 , 04:15:08

ఉపాధిపై కార్యదర్శులకు శిక్షణ

ఉపాధిపై కార్యదర్శులకు శిక్షణ

  • 15వ తేదీ నాటికి పూర్తికి ఆదేశాలు
  • ఉపాధిహామీపై మూడు మాడ్యూల్స్‌ రూపొందించిన గ్రామీణాభివృద్ధిశాఖ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఉపాధి హామీ పనుల నిర్వహణ బాధ్యతను పంచాయతీ కార్యదర్శులకు అప్పగించిన గ్రామీణాభివృద్ధిశాఖ.. వారికి శిక్షణ ఇవ్వాలని నిర్ణయించింది. ‘ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌, పంచాయతీ కార్యదర్శుల విధులు-బాధ్యతలు, హౌజ్‌హోల్డ్‌లను రిజిస్టర్‌ చేయడం- డిమాండ్‌కు అనుగుణంగా పనులు కల్పించడం’ అనే అంశాలపై మూడు మాడ్యూల్స్‌ను రూపొందించింది. వీటిని అనుసరిస్తూ తొలివిడతలో జిల్లాస్థాయిలో అసిస్టెంట్‌ ప్రాజెక్టు డైరెక్టర్లు, ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లకు, రెండోదశలో పంచాయతీ కార్యదర్శులకు ఒక్కరోజు శిక్షణ ఇవ్వాలని కలెక్టర్లను ఆదేశించింది. ఈనెల 15నాటికి శిక్షణ పూర్తిచేసేలా కార్యాచరణ రూపొందించాలని పేర్కొన్నది.

మాడ్యూల్స్‌లో ఏమున్నదంటే..

తొలి మాడ్యూల్‌లో ఈజీఎస్‌ వివరాలు పొందుపరిచా రు. పథక లక్ష్యం, కూలీల హక్కులు, పనులు చేయించడంలో పంచాయతీల పాత్ర, పనుల ప్రణాళికలను వివరించారు. రెండోదానిలో కార్యదర్శులు చేయాల్సిన 17 రకాల పనులను వెల్లడించారు. మూడోదానిలో ఇండ్లను గుర్తించి కూలీలకు జాబ్‌కార్డులు ఇవ్వడం, డిమాండ్‌ మేరకు పనుల కల్పన వంటివి పేర్కొన్నారు.

ఉపాధి అమలులో కార్యదర్శుల విధులు

  • జాబ్‌కార్డు దరఖాస్తులు స్వీకరించాలి. వాటిని పరిశీలించి కొత్తకార్డులు జారీచేయాలి. 
  • మేట్ల ద్వారా పని డిమాండ్‌ దరఖాస్తులు తీసుకొని రశీదులు ఇవ్వాలి. వాటిని అప్‌లోడ్‌చేసి, మండల కంప్యూటర్‌ కేంద్రంలో టీఏ ద్వారా వర్క్‌ అలాట్‌ చేయించాలి.
  • ప్రతి కూలీకి రోజువేతనం రూ.237 వచ్చేలా మేట్లు/టీఏల ద్వారా మార్కింగ్‌ చేయించాలి. ప్రతికూలీకి 100 రోజులు పని కల్పించాలి. 
  • వారాంతపు రోజును మేట్ల నుంచి మస్టర్లు సేకరించి టీఏలకు ఇవ్వాలి. టీఏలు కొలతలు తీయుటకు/ఇంజినీరింగ్‌ కన్సల్టెంట్లకు చెక్‌ మెజర్‌ చేసేందుకు సహకరించాలి. 
  • పంచాయతీకి సంబంధించిన రికార్డులు, రిజిస్టర్లు నిర్వహించాలి. పంచాయతీ పనుల ప్రణాళికను రూపొందించి అమలయ్యేలా చూడాలి. 


logo