శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 09, 2021 , 00:20:03

టీకాకు రూ.500 వరకు ఓకే

టీకాకు రూ.500 వరకు ఓకే

  • వ్యాక్సిన్‌ వేసుకొనేందుకు సగం మంది సిద్ధం
  • కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వ కృషి భేష్‌
  • హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ సర్వే

హైదరాబాద్‌, జనవరి 8 (నమస్తే తెలంగాణ): కరోనా టీకా కోసం కాస్త ఖర్చు పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కరోనా పరిస్థితులు, వ్యాక్సినేషన్‌పై హైదరాబాద్‌ మేనేజ్‌మెంట్‌ అసోసియేషన్‌ (హెచ్‌ఎంఏ) ఆన్‌లైన్‌ సర్వే నిర్వహించింది. ఈ నివేదికను శుక్రవారం విడుదలచేసింది. దీని ప్రకారం.. కరోనా సోకినవారు 14 రోజులపాటు స్వీయ నిర్బంధంలో ఉంటే నయమవుతుందని, ప్రతిరక్షకాలు ఉత్పత్తి అవుతాయని చాలామంది భావిస్తున్నారు. అయితే ముందు జాగ్రత్తగా టీకా తీసుకోవడం ఉత్తమమని భావిస్తున్నారట. టీకా అందుబాటులోకి వస్తే వేసుకొనేందుకు సగం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వాలు పెద్దఎత్తున అవగాహన కార్యక్రమాలు నిర్వహించి అపోహలు తొలిగించాలని హెచ్‌ఎంఏ సూచించింది. మొత్తం 14 ప్రశ్నలతో ఆన్‌లైన్‌లో నిర్వహించిన ఈ సర్వేలో పలు ఆసక్తికర విషయాలు వెల్లడయ్యాయి.

60 శాతానికిపైగా ప్రజలు వ్యాక్సిన్‌ కోసం ఖర్చు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నారట.

టీకా అందుబాటులోకి రాగానే వేసుకొనేందుకు సగం మంది మాత్రమే సిద్ధంగా ఉన్నారు. అదేసమయంలో సర్వేలో పాల్గొన్నవారిలో 82.93 శాతం మంది టీకా వేసుకోవడాన్ని ప్రభుత్వం తప్పనిసరి చేయాలని డిమాండ్‌ చేయడం విశేషం.
logo