ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 08, 2020 , 15:23:32

గోదావరి రివర్‌ ఫ్రంట్‌ టూరిజానికి ప్రత్యేక బడ్జెట్‌

గోదావరి రివర్‌ ఫ్రంట్‌ టూరిజానికి ప్రత్యేక బడ్జెట్‌

హైదరబాద్‌ : రాష్ట్ర బడ్జెట్‌లో ప్రతీసారి చేసే కేటాయింపులకు అదనంగా ఈసారి కొన్ని కొత్త కేటాయింపులు చేసినట్లు ఆర్థిక మంత్రి హరీష్‌రావు తెలిపారు. సీఎం కేసీఆర్‌ సూచనలకనుగుణంగా ఈ కేటాయింపులు చేసినట్లు ఆయన చెప్పారు. ముఖ్యంగా గోదావరి రివర్‌ ఫ్ఫ్రంట్‌ టూరిజం, హైదరాబాద్‌ పట్టణ, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు ఆర్థిక మంత్రి వెల్లడించారు.  మిషన్  భగీరథ, హరితహారం వంటి వాటికి కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించినట్లు మంత్రి తెలిపారు. ఈసారి బడ్జెట్‌లో సంక్షేమ రంగానికి కూడా నిధులు పెంచినట్లు ఆయన చెప్పారు. ఉదాహరణకు ఆసరా ఫించన్లు తీసుకుంటే.. గత ఏడాది దీనికి రూ.9402 కోట్లు కేటాయించగా ఈసారి 11758 కోట్ల రూపాయలు కేటాయించినట్లు చెప్పారు. అంటే ఈసారి ఆసరా ఫించన్లకోసం  అదనంగా 2356 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. 


దేనికి ఎంతెంత...

హైదరాబాద్‌, దాని పరిసర ప్రాంతాల అభివృద్ధికి రూ. 10 వేల కోట్లు
మిషన్‌ భగీరత పనుల కింద 38 మునిసిపాలిటీల్లో అంతర్గత పనుల పూర్తికి రూ. 800 కోట్లు
గోదావరి రివర్‌ ఫ్రంట్‌ టూరిజానికి రూ. 300 కోట్లు
మార్కెట్ ఇంటర్‌వెన్షన్‌ ఫండ్‌ కింద రూ. 1000 కోట్లు
హరితహారానికి రూ. రూ. 300 కోట్లు
అందరికీ విద్య(ఈచ్‌ వన్‌ టీచ్‌ వన్‌)కు 100 కోట్లు కేటాయించినట్లు మంత్రి చెప్పారు. 

ఇవే కాక ఇలాంటి చాలా కొత్త ఇనిషియేటివ్స్‌  ఎన్నడూ లేని విధంగా సీఎం సూచనలతో ఈ సారి బడ్జెట్‌లో చేర్చినట్లు మంత్రి తెలిపారు. 


logo