శుక్రవారం 03 జూలై 2020
Telangana - Feb 02, 2020 , 10:42:27

గచ్చిబౌలి స్టేడియంలో 'రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌'

గచ్చిబౌలి స్టేడియంలో 'రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌'

హైదరాబాద్‌: నగరంలోని గచ్చిబౌలి స్టేడియంలో రన్‌ ఫర్‌ గర్ల్‌ చైల్డ్‌ కార్యక్రమం నిర్వహించారు. సేవాభారతి స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. 5కె, 10కె, 21కె పేరిట వేర్వేరు విభాగాల్లో నిర్వాహకులు పరుగును నిర్వహించారు. పెద్ద సంఖ్యలో యువతులు, బాలికలు పరుగులో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వచ్చిన ఆదాయాన్ని బాలికల చదువుకు వినియోగించనున్నట్లు నిర్వాహాకులు తెలిపారు.


logo