సోమవారం 06 ఏప్రిల్ 2020
Telangana - Mar 16, 2020 , 16:29:40

బెంగళూరు యువకుడు రన్‌ ఫర్‌ కరోనా

 బెంగళూరు యువకుడు రన్‌ ఫర్‌ కరోనా

కరోనా వైరస్‌ గురించి నిరాధార సమాచారం ప్రచారం చేయొద్దని ప్రభుత్వాలు.. పోలీసులు ఎంత అవగాహన కల్పిస్తున్నా కొందరు గందరగోళ పరిస్థితిలోనే ఉన్నారు. ఏదో రకంగా ప్రజలకు కరోనాపై స్పష్టమైన అవగాహన కల్పించాలనుకొని ‘కరోనా రన్‌-40’ బెంగళూరుకు చెందిన యువ ఎంటర్‌ప్రెన్యూర్‌ సంతోష్‌. 

సంతోష్‌ మిశ్రా వ్యాపార రంగంలో మంచి గుర్తింపు ఉన్న యువకుడు. సాఫ్ట్‌వేర్‌ ఇంజినీర్‌ కూడా. చదువుకున్నవాళ్లు కూడా అపోహల్ని నమ్మడం.. విస్తరింపచేయడం ఎంతమాత్రం బాగలేదనుకున్నాడు సంతోష్‌. శనివారం సాయంత్రం 4 గంటలకు లాపెల్లె రోడ్‌.. ఎంజీ రోడ్‌.. బ్రిగేడ్‌ రోడ్‌.. కోరుమంగళ.. హెచ్‌ఎస్‌ఆర్‌ లే-అవుట్‌ వంటి ప్రధాన ప్రాంతాలను మొత్తం 40 కిలోమీటర్ల మేర.. ‘కరోనా రన్‌-40’ అనే అవేర్‌నెస్‌ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాడు. 

ఆదివారం మరో 40 కిలోమీటర్లు పరుగెత్తాడు. వాకింగ్‌గానీ.. రన్నింగ్‌గానీ చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుందని సంతోష్‌ అంటున్నాడు. ముందు జాగ్రత్త చర్యలతో వ్యాధితో పోరాడవచ్చు. ఆరోగ్యమైన జీవితాన్ని గడపవచ్చు. టీషర్ట్‌పై కొన్ని సందేశాలను పొందుపర్చాడు. ‘Corona Karona.. Jogging Karona.. Healthy Rahona Bilkul Darona.. Say no to panic, Yes to precautions అనే సందేశాలతో అవగాహన కల్పిస్తున్నాడు. తన రన్‌ను కొనసాగించేందుకు సిద్ధంగా ఉన్నట్లు సంతోష్‌ పేర్కొన్నాడు. 


logo