శనివారం 23 జనవరి 2021
Telangana - Jan 11, 2021 , 18:26:41

రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

రామలింగేశ్వరుడికి రుద్రాభిషేకం

యాదాద్రి భువనగిరి : యాదాద్రికొండపై వేంచేసి ఉన్న శ్రీపర్వత వర్దినీ సమేత రామలింగేశ్వరస్వామివారికి సోమవారం రుద్రాభిషేకం ఘనంగా నిర్వహించారు. విశేష సంఖ్యలో భక్త జనులు పరవశంతో పాల్గొని రుద్రాభిషేకం జరిపించారు. ప్రభాతవేళలో మొదటగా పరమశివున్ని కొలుస్తూ రుద్రాభిషేకంలో సుమారు గంటన్నర పాటు జరిగిన రుద్రాభిషేకంలో మమేకం అయ్యారు. ఉదయాన్నే పరమశివుడికి ఆవు పాలు, పంచామృతాలతో అభిషేకం చేశారు. పంచామృతాలతో శివలింగాన్ని అర్చించారు. అభిషేక ప్రియుడైన పరమశివున్ని విభూతితో అలంకరణ చేశారు. ఆలయంలోని సుభ్రహ్మణ్యస్వామి, మహాగణపతి, ఆంజనేయస్వామి, నాగదేవత విగ్రహాలకు కూడా అభిషేకం చేసి అర్చన చేశారు. 

ఇవి కూడా చదవండి..

ప్రభుత్వ పథకాల అమలులో ఎంపీడీవోలు కీలకం

మిషన్ భగీరథ పెండింగ్ పనులను పూర్తి చేయండి 

కూతురు పరీక్ష కోసం వెళ్లి తిరిగిరాని లోకాలకు


logo