సోమవారం 06 జూలై 2020
Telangana - Jun 27, 2020 , 02:01:15

కార్గో బుకింగ్స్‌కుఏజెన్సీలు విధివిధానాల ఖరారులో ఆర్టీసీ

కార్గో బుకింగ్స్‌కుఏజెన్సీలు విధివిధానాల ఖరారులో ఆర్టీసీ

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: కార్గో సర్వీసుల బుకింగ్స్‌ కోసం ప్రత్యేక ఏజెన్సీలను నియమించాలని టీఎస్‌ ఆర్టీసీ నిర్ణయించింది. ప్రత్యేకాధికారిని నియమించి ఇందుకు విధివిధానాలను ఖరారుచేసి పది రోజుల్లో నోటిఫికేషన్‌ ఇవ్వాలని భావిస్తున్నది. అర్హులైనవారికి ఏజెన్సీలు ఇచ్చి పార్శిల్‌ సర్వీసుల సేవలు కొనసాగించాలని యోచిస్తున్నది. ఏజెన్సీలకు బుకింగ్‌ మీద కొంత పర్సంటేజీని ఆర్టీసీ చెల్లించనున్నది. వస్తు రవాణా విలువలో కూడా కమీషన్‌ ఇవ్వనున్నది. ఆర్టీసీ అధీకృత డీలర్ల ద్వారా టికెట్‌ బుక్‌చేసినట్టు కార్గో సర్వీసులను కూడా అప్పగించనున్నట్టు టీఎస్‌ఆర్టీసీకి చెందిన ఓ ఉన్నతాధికారి తెలిపారు. హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాలతోపాటు జిల్లాల్లో కూడా ఇదే విధానం అనుసరించనున్నారు. సమీప డిపో మేనేజర్‌ పర్యవేక్షణలో ప్రతీ ఏజెన్సీ కొనసాగనున్నది.


logo