సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 16, 2020 , 02:21:26

ఆర్టీసీ ఈడీ టీవీ రావు హఠాన్మరణం

ఆర్టీసీ ఈడీ టీవీ రావు హఠాన్మరణం

-మంత్రి పువ్వాడ, పీఎస్‌ సునీల్‌శర్మ సంతాపం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ ఆర్టీసీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (అడ్మిన్‌, మెడికల్‌) టీ వెంకటేశ్వరరావు (టీవీ రావు) బుధవారం ఆకస్మికంగా మృతిచెందారు. సంస్థలో డిపో మేనేజర్‌గా ఉద్యోగ ప్రస్థానం ప్రారంభించిన టీవీ రావు.. డివిజనల్‌ మేనేజర్‌, ఓఎస్డీ, ప్రాంతీయ మేనేజర్‌, చీఫ్‌ పర్సనల్‌ మేనేజర్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా వివిధ హోదాల్లో పనిచేశారు. టీవీ రావు మృతి పట్ల రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌, ముఖ్యకార్యదర్శి సునీల్‌శర్మ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. 


logo