సోమవారం 10 ఆగస్టు 2020
Telangana - Jul 05, 2020 , 02:46:16

విధుల్లోనే తుదిశ్వాస

విధుల్లోనే తుదిశ్వాస

  • గుండెపోటుతో ఆర్టీసీ కంట్రోలర్‌ మృతి

చెన్నూర్‌/మంచిర్యాల అగ్రికల్చర్‌: మంచిర్యాల జిల్లాకు చెందిన ఆర్టీసీ కంట్రోలర్‌ లెక్కల రమణారెడ్డి విధుల్లో భాగంగా కాళేశ్వరానికి వెళ్లి, అక్కడే గుండెపోటుతో మరణించాడు. చెన్నూర్‌ నుంచి సుందరశాల, అన్నారం మీదుగా కాటారం, కాళేశ్వరానికి బస్సులు నడపాలని మంచిర్యాల డిపో అధికారులు నిర్ణయించారు. దీంతో రూట్‌ సర్వే చేసేందుకు శనివారం సిబ్బందితో కలిసి చెన్నూర్‌ బస్‌ స్టేషన్‌ నుంచి కంట్రోలర్‌ ఎల్‌ రమణారెడ్డి బయల్దేరారు. ముందుగా కాటారం చేరుకోగా, జయశంకర్‌ భూపాలపల్లి జెడ్పీ చైర్‌పర్సన్‌ హర్షిణి బస్సును ప్రారంభించారు. అనంతరం కాళేశ్వరం వెళ్లారు. అక్కడి  నుంచి తిరుగు ప్రయాణం కోసం బస్సు ఎక్కిన రమణారెడ్డి సీట్లో కూర్చున్న కాద్దిసేపటికే పక్కకు ఒరిగిపోయి ప్రాణాలు వదిలారు


logo