గురువారం 09 జూలై 2020
Telangana - Jun 18, 2020 , 02:00:25

రేపటి నుంచి ఆర్టీసీ కార్గో సేవలు

రేపటి నుంచి ఆర్టీసీ కార్గో సేవలు

  • రాష్ట్రంలోని 140 బస్‌ స్టేషన్లలో అందుబాటులోకి
  • రవాణాశాఖ భవన్‌లోప్రారంభించనున్నమంత్రి పువ్వాడ అజయ్‌

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: టీఎస్‌ఆర్టీసీ కార్గో, పార్సిల్‌ సేవలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి రానున్నాయి. శుక్రవారం ఖైరతాబాద్‌లోని రవాణాశాఖ భవన్‌లో రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్‌ ఈ సేవలను ప్రారంభించనున్నారు. అనంతరం కార్గో, పార్సిల్‌ చార్జీ ల వివరాలను మంత్రి తెలియజేయనున్నారు. లాక్‌డౌన్‌ సమయంలోనే ఆర్టీసీ కార్గో సేవల్ని మొదలు పెట్టగా.. ఇప్పుడు పూర్తిస్థాయిలో రం గంలోకి దిగుతున్నది. ప్రస్తుతం అంగన్‌వాడీ కేం ద్రాలకు బాలామృతం, ఇతర ఆహార పదార్థాల ను సరఫరాచేయడంతోపాటు పౌరసరఫరాల సంస్థకు సంబంధించి నిత్యావసర వస్తువుల రవాణాకు ఆర్టీసీ కార్గో సేవలను అందిస్తున్నది. మంత్రి ఓఎస్డీ కృష్ణకాంత్‌ కార్గో, పార్సిల్‌ సేవలకు సంబంధించి ప్రత్యేక అధికారిగా వ్యవహరిస్తున్నారు. 

రాష్ట్రంలోని 140 బస్‌ స్టేషన్లలో పార్సిల్‌ సేవల్ని అందించేందుకు ఏర్పాట్లు చేసినట్లు కృష్ణకాంత్‌ తెలిపారు. ఇందుకుగాను అదనంగా ఉన్న డ్రైవర్లు, కండక్టర్లను నియమించనున్నారు. ఎంజీబీఎస్‌, జేబీఎస్‌, కరీంనగర్‌, వరంగల్‌ తదితర ప్రధాన స్టేషన్లలో ఈ సేవలు అందించేందుకు పెద్ద సంఖ్యలో సిబ్బంది అవసరం కానున్నారు. పార్సిళ్లను బుక్‌చేసుకోవడం, వచ్చిన పార్సిళ్లను బస్సుల్లో నుంచి దించడం.. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 600 నుంచి 700 మంది అవసరం అవుతారని అధికారులు అంచనా వేస్తున్నారు. గతంలో పా ర్సిల్‌ సేవల్ని అందించిన ప్రైవేటు సంస్థ నెలకు రూ.70లక్షల చొప్పున ఆర్టీసీకి చెల్లించేది. 

ఈ క్ర మంలో ఆ సంస్థ కమీషన్లు, నిర్వహణ వ్యయం తో కలిపితే ఆర్టీసీకి నెలకు ఇంతకంటే ఎక్కువ ఆ దాయం వచ్చేందుకు అవకాశాలున్నాయి. అంటే పార్సిల్‌ సేవల ద్వారా ఏటా కనీసంగా రూ.10-12 కోట్ల వరకు వచ్చే అవకాశమున్నదని అధికారులు అంచనా వేస్తున్నారు. అటు.. ఏయే ప్రభు త్వ రంగాల్లో కార్గో సేవల్ని విస్తరించవచ్చు?, ప్రైవేటు వినియోగదారులను ఆకర్షించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవాలి? అన్న అంశాలపై అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.


logo