సోమవారం 26 అక్టోబర్ 2020
Telangana - Sep 25, 2020 , 10:28:17

హైదరాబాద్‌లో రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

హైదరాబాద్‌లో  రోడ్డెక్కిన ఆర్టీసీ బ‌స్సులు

హైద‌రా‌బాద్ : సుదీర్ఘ విరామం తర్వాత హైద‌రా‌బా‌ద్‌లో సిటీ బస్సులు రోడ్డె‌క్కాయి. నగ‌ర‌వా‌సుల సౌక‌ర్యార్థం బస్సు‌లను నడి‌పేం‌దుకు రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్‌ సిగ్నల్ ఇవ్వ‌డంతో.. శుక్ర‌వారం ఉద‌యం నుంచి 25 శాతం ఆర్టీసీ బ‌స్సులో అందుబాటులోకి వ‌చ్చాయి. మొత్తంగా నేటి నుంచి న‌గ‌రంలో 800 బ‌స్సులు తిరుగుతున్నాయి. ఈ బ‌స్సుల‌ను ప్ర‌ధాన‌మైన రూట్ల‌లో న‌డుపుతున్నారు. సుమారు 7 నెల‌ల త‌ర్వాత ఆర్టీసీ బ‌స్సుల‌ను పున‌రుద్ధ‌రించ‌డంతో.. ప్ర‌యాణికులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. ఆర్టీసీ బ‌స్సుల్లో కొవిడ్ నిబంధ‌న‌లు పాటిస్తున్నారు. ఒక్క సీట్లో ఒక‌రిని మాత్ర‌మే కూర్చోబెడుతున్నారు. కొవిడ్ నిబంధ‌న‌లు త‌ప్ప‌నిస‌రిగా పాటించాల‌ని ఆర్టీసీ అధికారులు ప్ర‌యాణికుల‌కు విజ్ఞ‌ప్తి చేస్తున్నారు. 


logo