బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 21, 2020 , 16:32:21

రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు నడువవు: సీఎంకేసీఆర్‌

రేపు ఆర్టీసీ బస్సులు, మెట్రోరైళ్లు నడువవు: సీఎంకేసీఆర్‌

హైదరాబాద్‌: ఒక్క ఆర్టీసీ బస్సు నడవొద్దు.... వేరే రాష్ర్టాల నుంచి బస్సులు రానీయమని సీఎం కేసీఆర్‌ తెలిపారు. హైదరాబాద్‌ మెట్రో రైళ్లు కూడా బంద్‌ పెడుతున్నాం. అత్యవసరం కోసం 5 మెట్రో రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటాయి. అని ప్రయాణికులను ఎక్కించుకోవు. ఎక్కడైన వైద్య బృందం, పోలీసుల అవసరమైతే వారి కోసం ఈ రైళ్లు నడుస్తాయి. వర్తక వాణిజ్య వ్యాపార సంఘాలు స్వచ్ఛందంగా బంద్‌ పాటించాలి. పాలు, మందులు, అంబులెన్స్‌, ఫైర్‌ సర్వీస్‌, ఆస్పత్రులు వంటి అత్యవసర సేవలు మాత్రమే తెరిచి ఉంటాయి. సరిహద్దు రాష్ర్టాలను కూడా ఒకటి రెండు రోజుల్లో మూసివేస్తాం. జబ్బు వ్యాప్తి  చెందకుండా కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. పాలు, పండ్లు, కూరగాయలు, పెట్రోల్‌ బంక్‌లు, మెడికల్‌ షాపులు యథావిధిగా తెరవాలి. 24 గంటల పాటు రాష్ట్రంలో చీమ చిటుక్కుమనొద్దని పిలుపునిచ్చారు. 


logo
>>>>>>