శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 14, 2020 , 11:35:40

వాగులో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు గల్లంతు

వాగులో చిక్కుకుపోయిన ఆర్టీసీ బస్సు.. ఇద్దరు గల్లంతు

యాదాద్రి : యాదాద్రి భువనగిరిల జిల్లాలో ఆర్టీసీ బస్సు వాగులో చిక్కుకుపోయి ఇద్దరు గల్లంతయ్యారు. మంగళవారం రాత్రి దిల్‌సుఖ్‌నగర్‌ నుంచి ప్రయాణికులతో ఆర్టీసీ బస్సు పోచంపల్లికి బయల్దేరింది. భారీ వర్షం కారణంగా పోచంపల్లి-కొత్తగూడెం మధ్యలో వాగుకు అనుహ్యంగా వరద ఉధృతి పెరిగి బస్సు ప్రవాహంలో చిక్కుకుపోయింది. బస్సు నుంచి బయటకు వచ్చేందుకు యత్నించిన పెద్దల మైసమ్మ, భోగ వైష్ణవి (18) అనే ఇద్దరు ప్రయాణికులు వరద ప్రవాహంలో గల్లంతయ్యారు. 40 మందిని అధికారులు సురక్షిత ప్రాంతానికి తరలించారు.

వీరికోసం సహాయ బృందాలు గాలిస్తున్నాయి. వాయుగుండం కారణంగా రాష్ట్రంలో యాదాద్రి భువనగిరి జిల్లాలో భారీ వర్షంపాతం నమోదైంది. దీంతో వాగులు, వంకలు మహోగ్రంగా ప్రవహిస్తున్నాయి. వలిగొండ వద్ద మూసీ ప్రమాదకరస్థాయిలో ప్రవహిస్తోంది. దీంతో అధికారులు లోతట్టు ప్రాంతాల గ్రామస్తులను అప్రమత్తం చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo