e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 17, 2021
Home తెలంగాణ ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు

ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు

ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు
  • ‘టీ యాప్‌ ఫోలియో’ మొబైల్‌ యాప్‌లో లభ్యం
  • సద్వినియోగం చేసుకోండి: రవాణాశాఖ కమిషనర్‌

హైదరాబాద్‌, మే 26 (నమస్తే తెలంగాణ): లాక్‌డౌన్‌ నేపథ్యం లో ఆన్‌లైన్‌లో 17 రకాల ముఖ్యమైన ఆర్టీఏ సేవలు అందిస్తున్నట్టు రవాణాశాఖ కమిషనర్‌ ఎంఆర్‌ఎం రావు తెలిపారు. వాహనదారులు తమ స్మార్ట్‌ఫోన్లలో ‘టీ యాప్‌ ఫోలియో’ మొబైల్‌ యాప్‌ ద్వారా ఎక్కడి నుంచైనా ఈ సేవలు పొందవచ్చన్నారు. స్మార్ట్‌ఫోన్‌ లో టీయాప్‌ ఫొలియో (T App folio) యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. మొబైల్‌ నంబర్‌తో రిజిస్టర్‌ చేసుకొని ఆర్టీఏ ఐకాన్‌పై క్లిక్‌ చేస్తే 17 రకాల సేవల జాబితా ప్రత్యక్షమవుతుంది. ఏ సేవను పొందాలనుకుంటే దానిపై క్లిక్‌ చేసి.. వివరాలు నమోదు చేయాలి. డాక్యుమెంట్లను అప్‌లోడ్‌చేసి ఆన్‌లైన్‌లో అఫ్లికేషన్‌ ఫీజును చెల్లిం చాక ఎస్‌ఎంఎస్‌ రూపంలో ఎప్పటికప్పుడు సమాచారం వస్తుంది. తర్వాత మెయిల్‌కు పీడీఎఫ్‌ రూపంలో పత్రాలు వస్తాయి.

ఆ 17 సేవలు ఇవీ..

1.డూప్లికేట్‌ లెర్నర్‌ లైసెన్స్‌, 2.డూప్లికేట్‌ లైసెన్స్‌, 3.ఇష్యూ ఆఫ్‌ బ్యాడ్జ్‌, 4.స్మార్ట్‌కార్డు, 5.లైసెన్స్‌ హిస్టరీ షీట్‌, 6.డ్రైవింగ్‌ లైసెన్స్‌ రెన్యువల్‌, 7.డ్రైవింగ్‌ లైసెన్స్‌లో అడ్రస్‌ మార్పు, 8.హజార్డస్‌ లైసెన్స్‌ ఎండార్స్‌మెంట్‌, 9.ఎక్స్‌పైర్డ్‌ లెర్నర్‌ లైసెన్స్‌ స్థానంలో కొత్త లెర్నర్‌ లైసెన్స్‌, 10.వాహన తరగతి ప్రకారం లెర్నర్‌ లైసెన్స్‌, 11. ఎక్స్‌ైపెర్డ్‌ డ్రైవింగ్‌ లైసెన్స్‌ వాళ్లకు లెర్నర్‌ లైసెన్స్‌, 12.ఆర్సీలో చిరునామా మార్పు, 13.రాష్ట్ర పరిధిలో క్లియరెన్స్‌ సర్టిఫికెట్‌, 14. కొత్త పర్మిట్‌, 15.డూప్లికేట్‌ పర్మిట్‌, 16.పర్మిట్‌ రెన్యువల్‌, 17. టెంపరరీ/స్పెషల్‌ పర్మిట్‌.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఆన్‌లైన్‌లో ఆర్టీఏ సేవలు

ట్రెండింగ్‌

Advertisement