గురువారం 02 జూలై 2020
Telangana - Jun 09, 2020 , 23:09:12

15 వేల ఫోన్‌ నెంబర్ల మీద ....18 లక్షల వాహనాలు రిజిస్టర్‌...

15 వేల ఫోన్‌ నెంబర్ల మీద ....18 లక్షల వాహనాలు  రిజిస్టర్‌...

హైదరాబాద్‌ : ట్రాఫిక్‌ ఈ చలాన్‌ జారీలో ట్రాఫిక్‌ పోలీసులు అనేక సమస్యలను ఎదుర్కుంటున్నారు. అందులో ఈ చలాన్‌లు ఒక్కరి ఫోన్‌ నెంబరు మీద వేలాది సంఖ్యలో రిజిస్టర్‌ ఉండడంతో ఆ ఫోన్‌ నెంబరు గల వ్యక్తికి ఈ చలాన్‌లు వెళ్తుండడం వాటి చెల్లింపు సరిగా జరగడం లేదు. దీంతో లక్షలాది ట్రాఫిక్‌ ఈ చలాన్‌లు పెండింగ్‌లో పడిపోతున్నాయి.వాహనం నెంబరు ఆధారంగా ఆర్‌టీఓలో నమోదైన వివరాలను బట్టీ ట్రాఫిక్‌ పోలీసులు ఈ చలాన్‌లను జారీ చేస్తున్నారు. అయితే ఇందులో చాలా వరకు ఈ చలాన్‌ల చెల్లింపులు జరగడం లేదు. ఈ నేపధ్యంలో పెండింగ్‌ ఈ చలాన్‌ పరిశీలించినప్పుడు ట్రాఫిక్‌ పోలీసుల షాక్‌ తిన్నారు. ఎందుకంటే రాష్ట్రవ్యాప్తంగా 15 వేల ఫోన్‌ నెంబర్ల మీద దాదాపు 18 లక్షల వాహనాలు రిజిస్టర్‌ అయ్యి ఉన్నాయి. వీరిలో అత్యధికంగా వాహనాలు డీలర్లు, మీడియేటర్‌లు ఇలా వాహనాన్ని అమ్మేసినప్పుడు వాటిని చట్టప్రకారం బదిలీ చేసుకోకుండా మొదటి యజమాని చిరునామా, ఫోన్‌ నెంబరు ఉండడమే కారణం. ఇలా ఒక వాహనం ఐదుగురు చేతులు మారిన మొదటి యజమానికే చలాన్‌లు వెళ్తున్నాయి. మరో వైపు చాలా మంది వాహనాల రిజిస్టర్‌ సమయంలో నమోదు చేసిన వివరాలు సరిగా లేకపోవడంతో ట్రాఫిక్‌ ఈ చలాన్‌ను పోస్టు ద్వారా డెలివరీ చేసేందుకు వెళ్ళినప్పుడు ఆ చిరునామాలో రిజిస్టర్‌ చేసుకున్న వ్యక్తి ఉండడం లేదని స్పష్టమవుతుంది. అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో అసలు చిరునామానే తప్పుగా ఉంటుంది. ఇక ఫోన్‌ నెంబరుకు విషయానికి వస్తే కూడా అదే పరిస్థితి నెలకొంది.ఒక వేళ ఆ ఫోన్‌ నెంబరు మీద ఈ చలాన్‌ జారీ చేసినప్పుడు ఆ ఫోన్‌ నెంబరు గల వాహనదారులు సార్‌ నేను ఆ వాహనం అమ్మేసి నాలుగేండ్లు అయ్యింది సార్‌ నా దగ్గర ఇప్పుడు వేరే వాహనం ఉంది సార్‌...ఆ చలాన్‌ నాకు వర్తించదని, నేను కట్టను కరాఖండిగా చెప్పుతుండడంతో ఆ చలాన్‌ పెండింగ్‌లో ఉంటున్నాయి. ఈ విధంగా లక్షలాది చలాన్‌లు పెండింగ్‌లో పడిపోయి కోట్లాది రుపాయాల ఆదాయం నిలిచిపోయింది. దీంతో పోలీసులు ఇప్పుడు వీటి వసూలుకు తలలు పట్టుకుంటున్నారు. ఉన్నతాధికారులు  పెండింగ్‌ చలాన్‌లు ఉండకుండా చూడండి అంటే ఆ వాహనదారుల ఆచూకీ దొరకడం కష్టసాధ్యంగా మారింది. ఇప్పుడ ఈ సమస్యకు ట్రాఫిక్‌ పోలీసులు, ఆర్‌టీఓ అధికారులు సరికొత్త పరిష్కారం కోసం అన్వేషణ చేయాల్సి ఉంది. ఒక ఫోన్‌ నెంబరు మీద 500 నుంచి 5 వేల వరకు రిజిస్టర్‌ అయ్యాయి.

అది పాత డాటా-ఆర్‌టిఓ సీనియర్‌ ఉన్నతాధికారి 

15 వేల ఫోన్‌ నెంబర్ల మీద 18 లక్షల వాహనాల రిజిస్టర్‌ అయిన అంశం అది పాత డాటా. దానిని అప్‌డేట్‌ చేస్తున్నాం. దీనికి తోడ ఆ వ్యవహరంపై విచారణ చేయిస్తున్నాం.సాంకేతికత పరిజ్ఞాణంతో వాటన్నింటిని సరి చేస్తాం.  

మా దృష్టికి వచ్చింది-సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం సీనియర్‌ అధికారి 

పెండింగ్‌ చలాన్‌లు పేరుకుపోతున్నాయి. దీని పై దృష్టి సారించినప్పుడు మాకు కొన్ని నిజాలు తెలిపాయి. ఆర్‌టీఓ అధికారులతో సమన్వయం పర్చుకుని ఆ సమస్యను పరిష్కరిస్తాం. వేలాది సంఖ్యలోని ఫోన్‌ నెంబర్ల మీద లక్షలాది వాహనాలు రిజిస్టర్‌ అయ్యినట్లు పెండింగ్‌ చలాన్‌ల ద్వారా తెలుస్తోంది.ఆర్‌టీఓ అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తాం.


logo