బుధవారం 01 ఏప్రిల్ 2020
Telangana - Mar 09, 2020 , 03:06:06

పల్లెకు రాజయోగం

పల్లెకు రాజయోగం
  • బడ్జెట్‌లో రూ.23 వేల కోట్ల కేటాయింపు.. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.600 కోట్లు
  • ఉపాధి హామీ సామగ్రికి రూ.65 కోట్లు.. కర్మచారులకు రూ.2 లక్షల బీమా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఏండ్లకేండ్లుగా వెనుకబడిన గ్రామాలకు స్వరాష్ట్రంలో రాజయోగం మొదలైంది. వివిధ రూపాల్లో గ్రామాలకు ఏటా సగటున రూ.8 వేల కోట్ల నిధులు అందుబాటులోకి తీసుకొస్తామన్న సీఎం కేసీఆర్‌ హామీ బడ్జెట్‌లో ప్రతిఫలించింది. ఈ బడ్జెట్‌లో పంచాయతీరాజ్‌శాఖకు భారీగా రూ.23 వేల కోట్లు కేటాయించారు. సీసీ రోడ్ల నిర్మాణానికి రూ.600 కోట్లు కేటాయించారు. ప్రస్తుతం ఆర్థిక సంఘం నిధుల నుంచి విద్యుత్‌ బిల్లులు చెల్లిస్తున్నారు. ఎల్‌ఈడీ వీధిదీపాలతో ఈ ఖర్చు సగానికి తగ్గుతుంది. 


మరోవైపు మిషన్‌ భగీరథ నుంచి గ్రామాలకు మంచినీరు అందుతుండటంతో తాగునీటికి వెచ్చిస్తున్న నిధులు కూడా ఆదా కానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి గ్రామాల అభివృద్ధికి పంచాయతీరాజ్‌శాఖ రూ.23,005 కోట్లు ఖర్చు చేయనుండటంతో జనాభా ప్రాతిపదికన చిన్న గ్రామాలకు కూడా ఏటా రూ.5 లక్షల నుంచి రూ.8 లక్షల మేరకు నిధులు వస్తాయి. వీటికి ఉపాధి హామీ నిధులు, పన్నుల ద్వారా వచ్చే ఆదాయం అదనం. గ్రామాల్లో పనిచేసే పారిశుద్ధ్య కర్మచారులకు ప్రభుత్వం రూ.8,500 గౌరవ వేతనంతోపాటు రూ.2 లక్షల జీవిత బీమా కల్పిస్తున్నది. ఈ ప్రీమియంను పంచాయతీరాజ్‌శాఖే చెల్లించనున్నది. ఉపాధి హామీ పథకం పనులకు అవసరమయ్యే వస్తు, సామగ్రి కొనుగోళ్లకు ప్రభుత్వం వచ్చే ఆర్థిక సంవత్సరంలో రూ.65 కోట్లు వెచ్చించనున్నది.


logo
>>>>>>